జగన్ కు అల్టిమేటమ్ పంపిన పవన్… డోంట్ రిపీట్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అల్టి మేటమ్ జారీ చేశారు… ఏపీ సర్కార్ మరో రెండు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో కలెక్టరేట్ల ముందు శిబిరాలు వేసి ఆందోళన చేస్తామని పవన్ హెచ్చరికలు పంపారు…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగింటే సరిచేయాలి తప్ప మొత్తం భవణ నిర్మాణ రంగాన్నే అపేయకూడదని అన్నారు… దీని వల్ల సుమారు 35 లక్షల భవన నిర్మాణ రంగంపై ఆధార పడిన ప్రజలు అవస్థ పడుతుందని అన్నారు…

అంతేకాదు పనులేక ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షలు చెల్లించాలని అన్నారు… అలాగే పని దొరికేదాక భవన నిర్మాణ కూలీల కుటుంబాలకు ప్రతీ నెల 50 వేలు వారి అకౌంట్లలో జమ చేయాలని పవన్ డిమాండ్ చేశారు..