పవన్ కి అదిరిపోయే పంచ్ లు వేసిన విజయసాయిరెడ్డి

పవన్ కి అదిరిపోయే పంచ్ లు వేసిన విజయసాయిరెడ్డి

0

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చు అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహర్ రెడ్డి శాసనసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే… దీనిపై ఏపీ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి… ఇదేక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మూడు రాజధానులు విషయంలో స్పందించిన సంగతి తెలిసిందే… ఒక రాజధానికే దిక్కులేదని అనుకుంటుంటే మూడు రాజధానులు ఎలాసాధ్యం అని ప్రశ్నించారు…

అమరావతిలో పరిపాలన ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇప్పుడిప్పుడే రాజధాని ప్రాంతానికి అలవాటుపడుతున్నారు. వారి పిల్లల్లు కూడా రాజధాని ప్రాంతంలో విద్యాలయాల్లో చేరారు. వాళ్ళని మళ్ళీ ఎగ్జిక్యూటివ్ రాజధాని అని మరోచోటికి వెళ్లిపోమంటే ఎలా అని కామెంట్స్ చేశారు పవన్… ఇక ఆయన చేసిన కామెంట్స్ పై విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు…

రాజధాని మూడు చోట్ల ఉంటే తప్పేమిటని అని జగన్ మోహన్ రెడ్డి అన్నారో లేదో యజమాని కంటే ముందే బానిస మొరుగుతున్నారని పవన్ నుఉద్దేశించి వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. అమరావతికే దిక్కులేదు మూడు నగరాలెలా కడతారని అజ్ణానాన్ని చాటుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. కర్నూలు, విశాఖ అభివృద్ది చెందిన నగరాలని అమరావతిని ఎటూ కాకుండా చేసిన పాపం చంద్రబాబుదేనని విజయసాయిరెడ్డి ఆరోపించారు..