పవన్ కు రోజా కౌంటర్….

పవన్ కు రోజా కౌంటర్....

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు… గతంలో రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ తన మనసులో కర్నూల్ జిల్లానే రాజధాని అయిఉంటే బాగుండేదని చెప్పారని కానీ ఇప్పుడు మాట మార్చారని రోజా ఫైర్ అయ్యారు..

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… చంద్రబాబునాయుడు రాజధాని రైతుల భూములు గతంలో బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు… ఇప్పుడు అదే రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు…

అమరావతినుంచి రాజధానిని తరలిస్తామని చంద్రబాబుకు ఎవరు చెప్పారని రోజా ప్రశ్నించారు… అలాగే రాజధాని విషయంలో బీజేపీ నేతలు యూటర్న్ తీసుకోవడం బాధాకరమని అన్నారు.. తమ సొంతప్రయోజనాలకోసం బీజేపీలో చేరిన సుజనా సీఎం రమేష్ లు జగన్ ను విమర్శించే అర్హత లేదని అన్నారు…