పవన్ ను భారీగా టార్గెట్ చేసిన వైసీపీ…

పవన్ ను భారీగా టార్గెట్ చేసిన వైసీపీ...

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు… గతంలో పవన్ కళ్యాణ్ టీడీపీకి వ్యతిరేకంగా అమరావతి రాజధానిలో పర్యటించారని అప్పుడు ఆయన రాజధాని రైతులకు అండగా ఉంటానని చెప్పారని తెలిపారు…

అంతేకాదు పెరుగు అన్నంకూడా తిన్నారని అమర్నాథ్ గుర్తు చేశారు… అయితే ఆ అన్నం అరిగేలోపు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు చేరుకుని మాటమార్చారని ఆరోపించారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు విని అశోక్ గజపతికాజు, కళావెంకటరావు, అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు…

విశాఖ రాజధానిని విమర్శించే ఉత్తరాంధ్ర రాజకీయ నేతలంతా ద్రోహులని అమర్నాథ్ ఆరోపించారు…. చంద్రబాబు నాయుడు అద్బుతమైన రాజధానిని నిర్మిస్తే ఆయన కుమారుడు లోకేశ్ మంగళగిరిలో ఎందుకు ఓటమి చెందారని ఆయన ప్రశ్నించారు…