జగన్ కు పవన్ అదిరిపోయే ఆఫర్

జగన్ కు పవన్ అదిరిపోయే ఆఫర్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే వందరోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే ఈ వందరోజుల పాలన పూర్తి అయిన తర్వాత నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒంటేద్దుమీద లేస్తున్నారు…

జగన్ పరిపాలనను విమర్శిస్తూ ఇటీవలే తొమ్మిది అంశాలతో కూడిక ఒక ప్రకటన కూడా చేశారు. దాని తర్వాత పలు అంశాలపై స్పందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో మరో ట్వీట్ చేశారు పవన్…ఈ ఏడాది వర్షాలు భారీగా ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ సహజంగానే తగ్గుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున రోజుకి 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని ముందుగానే విద్యుత్ రంగ నిపుణులు అంచనాలు వేశారు.

ఆ మేరకు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో సగటున రోజుకి 55 యూనిట్ల మేరకే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ ఫలితమే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు. పల్లెల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా చీకట్లే. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా అని ప్రశ్నించారు.