పవన్ పై కొత్త అస్త్రాన్ని ప్రయోగించిన వైసీపీ… దీంతో గ్లాసు పగలనుందా…

పవన్ పై కొత్త అస్త్రాన్ని ప్రయోగించిన వైసీపీ... దీంతో గ్లాసు పగలనుందా...

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు…పవన్ కళ్యాణ్ అమరాతి మీద ప్రేమ ఉంటే 2019 ఎన్నికల్లో అక్కడే పోటీ చేయాల్సి ఉండేని అన్నారు…

ఎందకు గాజువాకలో పోటీ చేశారని అవంతి ప్రశ్నించారు… తాజాగా విశాఖలో రాజధానికి మద్దతుగా ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు… ఈ ర్యాలీకి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు… ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ గాజువాక ప్రజలు ఓడించారనే ఉద్దేశంతో ఇక్కడి ప్రజలపై కోపం పెంచుకున్నారని అవంతి ఆరోపించారు…

అందుకే ఆయన అమరావతిమీద ప్రేమ చూపెడుతూ విశాఖ రాజధానికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు… మరోవైపు రాజధాని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే వారికి మద్దతుగా టీడీపీ నాయకులు నిలిచారు…