పవన్ పై విజయసాయిరెడ్డి పంచ్

పవన్ పై విజయసాయిరెడ్డి పంచ్

0

సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేస్తుంటారు… ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తే తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు…

అయితే ఇదే క్రమంలో మరో సారి వీరిద్దరిపై సైటర్లు వేశారు విజయసాయిరెడ్డి… యజమాని ఆర్డరేస్తేనే ప్యాకేజీ స్టార్ బీజేపీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీని తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ముందుగా పావలాను పంపిస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలానికి పొత్తు వల్ల ఒరిగేదేమి లేకున్నా సైకిల్ పార్టీకి మేలు జరిగేలా చూసుకోవాలనేది బాబు ఎత్తుగడ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు…