2024 ఎన్నికలకు పవన్ భారీ ప్లాన్

2024 ఎన్నికలకు పవన్ భారీ ప్లాన్

0

2019 ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలవకపోయినప్పటికీ కనీసం ఒక 25 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ఏపీలో కింగ్ మేకర్ అవ్వాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావించారు. కానీ ఆయన ఈ ఎన్నికల్లో పట్టుమని 10 స్థానాలకు కూడా గెలవలేకపోయారు…

పవన్ ఏరికోరి ఎన్నుకున్న గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో సైతం ఓటమి చెందారు. అయితే దీనికి కారణం క్షేత్ర స్థాయిలో బలం లేకపోవడం అందుకే ఈ సారి ఎట్టిపరిస్థితిలో అధికారంలోకి రావాలనే ఉద్దేశంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారట.

2019 ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందే జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రచేసి ఘనవిజయం సాధించారని అయితే తాను కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని పవన్ నిర్ణయించుకున్నారట. గతంలో పాదయాత్ర చేసిన వారు ఇంతవరకు ఎవ్వరు ఓటమి చెందలేదని అందుకే పవన్ ఇప్పటినుంచే పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలనుంచి సమాచారం అందుతోంది.