పవన్ వైసీపీకి అల్టిమేటమ్…

పవన్ వైసీపీకి అల్టిమేటమ్...

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటమ్ జారీ చేశారు… జనసేన నాయకులపై అక్రమంగా నమోదు చేసిన కేసులనువెంటనే రద్దు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు… ఈమేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు…

స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పోలీసులను ఆయుధంగా వాడుకుంటున్నారని పవన్ ఆరోపించారు… మొన్న కాకినాడలో కూడా ఇదే విధంగా తమ కార్యకర్తలపై దాడులు జరిగాయని అన్నారు… వైసీపీ నాయకులు చేసిన విమర్శలకుసమాధానం చెబితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు…

ఇళ్లకు పోలీసులను పంపి మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు… వైసీపీ నాయకులు తమ తీరును మార్చుకోకుంటే ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు.. అలాగే జనసేన నాయకులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్