లాంగ్ మార్చ్ వేనుక పవన్ భారీ ప్లాన్

లాంగ్ మార్చ్ వేనుక పవన్ భారీ ప్లాన్

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే నెల 3న విశాఖ జిల్లా సాక్షిగా భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నారు… ఈ పోరాటం వెనుక పవన్ భారీ ప్లాన్ వేస్తున్నారని రాజకీయ మేధావులు అంటున్నారు…

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించిలనే ఫార్ములాను పవన్ పాటిస్తున్నారట… 2019 ఎన్నికల్లో పవన్ విశాఖ జిల్లా నుంచి పోటీ చేసి ఓటమి చెందారు… అయితే అన్ని జిల్లాలతో పోల్చుకుంటే ఈ జిల్లాలోనే జనసేన పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి.

అందుకే పవన్ ఇక్కడనుంచి ప్రజా పోరాటాలు చేసి ప్రజల్లో జనసేన పట్ల నమ్మకాన్ని నింపాలని చూస్తున్నారు…. ఇప్పటికే లాంగ్ మార్చ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి… ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు సిద్దమయ్యారు…