క్యాస్టింగ్ కౌచ్ వల్లే ఆఫర్లు వదులుకున్నా..!

క్యాస్టింగ్ కౌచ్ వల్లే ఆఫర్లు వదులుకున్నా..!

0

ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసిన నటి పాయల్ రాజ్ పుత్. ఆ సినిమాలో ఈమె నటన విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఎక్స్‌పోజింగ్, ముద్దు సీన్లు కాస్త ఎక్కువయ్యాయనిపించినా, బాక్సాఫీసు వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించింది. సాధారణ చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా విజయం పాయల్ కి మంచి ఆఫర్లు తెచ్చిపెడుతుందనుకున్నారు.

కానీ ఈ సినిమా విజయం తరువాత క్యాస్టింగ్ కౌచ్ ఆమెని ఇబ్బంది పెట్టిందట. పెద్ద పెద్ద సంస్థల నుంచి ఆమెకు ఆఫర్లు వచ్చాయంట కానీ అసినిమాల్లో నటించాలంటే కమిట్‌మెంట్ అడిగేవారట వాళ్ల మాటలు విటుంటే తనకి చిరాకు పుట్టేదట, వాల్లతోనే కాకుండా వారు చెప్పిన వారితో కూడా కమిట్ అవ్వాలని చెప్పారంటా.. అది నచ్చక ఆమె పెద్ద పెద్ద ఆఫర్లను కూడా వదుకుకుందట క్యాస్టింగ్ కౌచ్ అడుగుతున్నారంటూ ఎన్నీ వివాదాలు వచ్చినా. టాలీవుడ్ నుంచి హాలీవుడ్‌దాకా మీటూ ఉద్యమం సాగింది. అయిప్పటికీ దీనివల్ల అమ్మాయిలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. హిట్ సినిమాలో నటించిన పాయల్ పరిస్థితే ఇలా ఉంటే కొత్తగా వచ్చే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ క్యాస్టింగ్ కౌచ్‌కు ఫుల్ స్టాప్ మాత్రం పడటం లేదు.

ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ నాలుగు సినిమాల్లో నటిస్తుంది. ఆర్ డి ఎక్స్ లవ్ అంటూ ప్రేక్షకులకు మరోసారి అందాల విందు అందించబోతుంది ఈ భామ. అయితే ఆర్ డి ఎక్స్ లవ్ టీజర్ నిన్ననే రిలీజ్ అయింది. ఇంకా డిస్కో రాజా, వెంకీ మామా సినిమాల్లో నటిస్తున్న పాయల్ తన కెరీర్‌ని ఎలా నిలుపుకుంటుదో వేచి చూడాలి.