పీసీసీ పదవికి ఉత్తమ్ గుడ్ బై ఎప్పుడంటే

పీసీసీ పదవికి ఉత్తమ్ గుడ్ బై ఎప్పుడంటే

0

కాంగ్రెస్ పార్టీ దాదాపు రెండు సార్లు కేంద్రంలో అధికారానికి దూరం అయింది, చాలా రాష్ట్రాల్లో బీజేపీ తన హావా చాటుతోంది.. కాని కాంగ్రెస్ మాత్రం పుంజుకోవడం లేదు, తాజాగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటా అని అందరూ డైలమాలో ఉన్నారు.. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దారుణమైన ఓటమి చూసింది ఇటీవల హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కూడా ఓటమి పాలైంది కాంగ్రెస్ పార్టీ.

తాజాగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పీసీసీ పదవి కారణంగా సొంత నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని వివరించారు. అయితే పీసీసీ పదవి పై చాలా మంది ఇప్పుడు చర్చించుకుంటున్నారు, ఉత్తమ్ రాజీనామా చేసి హుజూర్ నగర్, కోదాడ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

అయితే ఈ నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు, త్వరలో ఆయన ఈ పదవి నుంచి తప్పుకుంటారు అని తెలుస్తోంది.. హస్తిన వెళ్లి కాంగ్రెస్ రథసారధులతో చర్చిస్తారట, ఆపై నిర్ణయం రాజీనామా చేస్తారు అని తెలుస్తోంది. అయితే మున్సిపల్ ఎన్నికల ముందు ఉత్తమ్ ఈ నిర్ణయం తీసుకోవడంతో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి, మున్సిపల్ పోరు వరకూ ఆయనని ఉండాలి అని కోరే అవకాశం ఉంది అని తెలుస్తోంది.