ఫైట్ మాస్టర్ మాస్ హీరో.. హిట్ వచ్చేనా..!!

ఫైట్ మాస్టర్ మాస్ హీరో.. హిట్ వచ్చేనా..!!

0

ఈ మధ్య కొరియోగ్రాఫర్స్ డైరెక్షన్ చేయడం సాధారణ విషయమే అయినా ఫైట్ మాస్టర్స్ డైరెక్షన్ చేయడం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది.. ఇదే కోవలోకి ఫైట్ మాస్టర్ పీటర్ హైన్స్ చేరాడు.. తాను త్వరలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.. ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ నిర్మించనున్నారు. ఇప్పటికే సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఈ సినిమా లో బెల్లకొండ శ్రీనివాస్ ని హీరోగా ఎంచుకొన్నట్టు సమాచారమ్.. బెల్లకొండ సురేశ్ ఫ్యామిలీతో నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఎప్పటి నుంచో బెల్లకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయాలని భావిస్తున్నారు. అది ఇప్పుటికి కుదిరింది. ఇప్పటికే పీటర్ హెయిన్స్ పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేశారు. పైట్ మాస్టర్ గా ఆయన చేతిలో ఉన్న సినిమాలని పూర్తి చేసి మెగా ఫోన్ పట్టుకోనున్నారు.