పీకే సంచలన వ్యాఖ్యలు

0

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీపై విమర్శలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​. తన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సామర్థ్యాలను చూసి రాహుల్​ భయపడుతున్నారని ఆరోపించారు. ప్రియాంక అచ్చం తన నానమ్మ, దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీలానే ఉంటారని, ఆమెలో బలమైన నాయకత్వ లక్షణాలున్నాయని అన్నారు.

2017 ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ​ ఎన్నికల్లో కాంగ్రెస్​ సీఎం అభ్యర్థిగా..ప్రియాంకను ప్రకటించకపోవడానికి ఇదే కారణమని చెప్పారు. ఓ టీవీ ఛానల్​తో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కొద్దిరోజులక్రితం కూడా ప్రశాంత్​ కిశోర్​..కాంగ్రెస్​పై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్​ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఉదంతంపై ఉద్యమించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలోని ప్రతిపక్ష పాత్ర వేగంగా బలోపేతం అవుతుందని అనుకోవడం తొందరపాటు అవుతుందని హెచ్చరించారు. అంతర్గతంగా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్‌ పునరుత్థానం సాధించలేదని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here