ప్లీజ్ జ‌నాలు ఇది గ‌మ‌నించాలి? పోలీసులు ఆ ప‌ని చేయ‌డం లేదు

ప్లీజ్ జ‌నాలు ఇది గ‌మ‌నించాలి? పోలీసులు ఆ ప‌ని చేయ‌డం లేదు

0

నిజ‌మే జ‌నాలు అంద‌రూ గ‌మ‌నించాలి, మ‌న కోస‌మే రోడ్ల‌పై పోలీ‌సులు ఉంటున్నారు, ఎవ‌రిని బ‌య‌ట‌కు రావ‌ద్దు అని చెబుతున్నారు, అయితే కొంద‌రు మాత్రం అవేమీ ప‌ట్టించుకోకుండా వ‌స్తున్నారు.. దీని వ‌ల్ల స‌మ‌స్య మ‌రింత పెరుగుతోంది, రెండు తెలుగు స్టేట్స్ లోనే కాదు యావ‌త్ దేశంలో ఇప్పుడు పోలీ‌సులు కూడా చాలా ఓపిక‌గా చెబుతున్నారు బ‌యట‌కు రావద్దు అని.

ముందు లాఠీల‌కు ప‌ని చెప్పా‌రు… కాని రాను రాను వారు కూడా లాఠీల‌తో కాకుండా ప్రేమగా చెప్పారు, చాలా మందిలో మార్పు వ‌చ్చింది… కాని కొంద‌రిలో మార్పు రావ‌డం లేదు, అయితే ఇది అలుసుగా తీసుకుని, ఇక మ‌న‌పై పోలీసులు లాఠీల‌కు ప‌ని చెప్ప‌డం లేదు క‌దా అని, కొంద‌రు చిటీకి మాటికి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.

అయి‌తే త‌మిళ‌‌నాడులో మాత్రం ఇలా కొంద‌రు చిన్న చిన్న అవ‌స‌రాల‌కు కావాల‌ని తిరిగితే మాత్రం, లాఠీల‌కు ప‌ని చెబుతున్నారు పోలీసులు, చెన్నైలో కేసులు పెరుగుతూ ఉండ‌టంతో , ఇక మళ్లీ అక్క‌డ సీరియ‌స్ గా పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు, ప్లీస్ అర్దం చేసుకోండి మ‌న కోస‌మే క‌దా అని అక్క‌డ చాలామంది సోష‌ల్ మీడియాలో ఇలా తిరిగే వారిని రిక్వెస్ట్ చేస్తున్నారు.