పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా..మరి ఇద్దరు సీఎంల పరిస్థితి ఏంటి?

Pocharam Srinivasareddy to Corona..what is the situation of the other two CMs?

0

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్న రాత్రి హెల్త్ చెకప్‌లో పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు తెలిపారు. దీంతో పోచారం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని AIGలో అడ్మిట్‌ అయ్యారు.

మూడు రోజుల కిందటే స్పీకర్ తన మనువరాలి వివాహ వేడుకల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో వారు పక్క పక్కనే కూర్చుని స్పీకర్‌తో మాట్లాడారు. దీనితో తనకు పాజిటివ్‌ రావడంతో అందరూ టెస్ట్‌ చేసుకోవాలని, ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ పోచారం కోరారు. దీంతో సీఎంల పరిస్థితి ఏంటి అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here