పోలీసులు స‌రికొత్త ప‌నిష్మెంట్ క‌రెక్ట్ అంటున్న జ‌నాలు

పోలీసులు స‌రికొత్త ప‌నిష్మెంట్ క‌రెక్ట్ అంటున్న జ‌నాలు

0

క‌రోనా వేళ ఎవ‌రూ బ‌య‌ట‌కు రావద్దు అని ప్ర‌భుత్వం చెబుతోంది.. పోలీసులు ఎంతో చెప్పారు.. లాఠీల‌కు ప‌ని చెప్పారు… బైకుల‌కి కేసులు, కార్ల‌పై కేసులు రాస్తున్నారు… ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రిస్తున్నారు.. అయినా చాలా మందిలో మార్పు లేదు.. చీటీకి మాటికి చిన్న చిన్న అవ‌స‌రాల‌కు కూడా రోడ్ల‌పైకి వ‌స్తున్నారు.

ఈ స‌మ‌యంలో కేసులు పెర‌గ‌డంతో ప్ర‌భుత్వానికి ఇది పెద్ద త‌ల‌నొప్పి అవుతోంది… ఓ ప‌క్క రోడ్ల‌పై వ‌చ్చే వారిని ఆపాలా లేదా శాంతి భ‌ద్ర‌త‌లు చూడాలా, ఈ కేసుల విష‌యంలో దొర‌క‌ని వారిని ప‌ట్టుకోవాలా అనే ఇబ్బంది వారికి ఉంటోంది.

తాజాగా ఇలా ప‌ట్టుకునే వారికి 100 గుంజీలు లేదా ఇంటి‌కి న‌డిచి వెళ్లాలి అని ప‌నిష్మెంట్లు ఇస్తున్నారు, హెల్త్ ఎమ‌ర్జెన్సీ మిన‌హ మ‌రేకార‌ణం చెప్పినా వ‌ద‌ల‌డం లేదు… అది కూడా ప‌క్కా ఫ్రూఫ్ ఉండాల్సిందే, ఈ స‌మ‌యంలో లాక్ డౌన్ వేళ ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చే వారికి స‌రికొత్త ప‌నిష్మెంట్ ఇచ్చారు.

ఇలా రోడ్డు మీద‌కి వ‌చ్చిన వారిని ద‌గ్గ‌ర‌కు పిలిచి వైట్ పేప‌ర్ పెన్ను ఇస్తున్నారు,ఆ పేపర్‌పై తప్పైపోయింది సార్ క్షమించండి అనే పదాన్ని ఓ 500 సార్లు రాసి తర్వాత అక్కడ్నుంచి కదలమని చెబుతున్నారు. దీంతో చాలా మంది ఇదేం ప‌నిష్మెంట్ బాబు అంటూ భ‌య‌ప‌డుతున్నారు, మీరు వ‌చ్చిన ప‌ని 10 నిమిషాలు అవ్వ‌చ్చు… కాని అది రాయ‌డానికి గంట ప‌డుతుంది, ఇక అయినా మార‌క‌పోతే రేప‌టి నుంచి 1000 సార్లు రాయిస్తాం అంటున్నారు పోలీసులు