పోలీస్ స్టేషన్ కు జేసీ

పోలీస్ స్టేషన్ కు జేసీ

0

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరు అయ్యారు… టీడీపీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామన్న వ్యాఖ్యలపై ఆయనపై కేసు నమోదు అయింది…

అందులో భాగంగానే జేసీ బెయిల్ తీసుకుని పోలీసుల ఎదుట హాజరు అయ్యారు… చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా జేసీ గత నెల 18 వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఆయన వ్వాఖ్యలపై ఇటీవలే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా స్పందించారు.

శాంతి భద్రతల కోసం నిత్యం పనిచేస్తున్న పోలీసులను కించపరిచేలా మాట్లాడటం మంచిదికాదని మాధవ్ అన్నారు. అంతేకాదు మీడియా సాక్షిగా మరోసారి మీసం కూడా తిప్పారు గోరంట్ల… పోలీసులను కించ పరిచే విధంగా మాట్లాడిన జేసీపై 153 అలాగే 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు… అందులో భాగంగానే జేసీ బెయిల్ తీసుకుని పోలీసుల ఎదుట హాజరు అయ్యారు…