మరోసారి పవన్ పరువు తీసిన పూనమ్…

మరోసారి పవన్ పరువు తీసిన పూనమ్...

0

స్టార్ హీరోయిన్ పూన‌మ్ కౌర్ కొద్ది సోషల్ మీడియాను వేదిక‌గా చేసుకుని క‌రెంట్ ఇష్యూష్ పై స్పందిస్తూ త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తు ఉంటారు. ముఖ్యంగా ఈమె పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంటారు. ప్రత్యక్షంగా పవన్ పేరు ప్రస్తావించనప్పటికీ పరోక్షంగా ఆయన్ను టార్గెట్ చేసేవిధంగా విమర్శలు చేస్తుంటారు…

2019 ఎన్నికల ముందు పవన్ ఎక్కువగా టార్గెట్ చేసిన పూనమ్ ఆయన ఓటమి తర్వాత ట్వీట్ చేయడం బంద్ చేసింది… తాజాగా పార్టీపై ప్రజలకు నమ్మకాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పవన్. అందులో భాగంగా వచ్చే నెల 3 భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా పోరాటం చేయనున్నారు..

ఈ క్రమంలో పూనమ్ ఒక షాకింగ్ కామెంట్ చేసింది.. ఓ అబద్దాల కోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ లీడర్ మాత్రం కాలేడని అంటు ఆమె పేరు ప్రస్తావించకుండా ట్వీట్ చేసింది… జస్ట్ ఏ థాట్ అని పేర్కొంది.. అయితే ఈ ట్వీట్ పవన్ గురించే అన్న సందేహాలు వస్తున్నాయి.