యంగ్‌టైగర్‌కు అంత సత్తా లేదు: పోసాని

యంగ్‌టైగర్‌కు అంత సత్తా లేదు: పోసాని

0

ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికే కీలక నేతలు కొందరు పార్టీ మారగా.. మరికొందరు కూడా టీడీపీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని కాపాడేది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడేనని ఆ పార్టీ కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు అప్పగిస్తే సమర్థవంతంగా ఆ పార్టీని ముందుకు నడపగలడని వారు ఆశిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ వచ్చినా.. టీడీపీకి మహర్దశ కల్లనే అని ప్రముఖ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి అంటున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పోసాని.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్ మళ్లీ ఎంట్రీ ఇచ్చినా.. పార్టీ ముందుకు సాగజాలదని అభిప్రాయపడ్డారు. హీరోలను జనాలు నమ్మే పరిస్థితులు పోయాయని.. అందరూ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హీరో ఇమేజ్‌కి, రాజకీయాలకు మధ్య సంబంధమన్నది ఏదీ లేదని..

ఇమేజ్‌ను నమ్ముకుంటే కొంతమంది అభిమానులను సంపాదించుకోగలరేమో కానీ వారి ఓట్లను పొందలేదని పోసాని తెలిపారు. అంతేకాకుండా తాను వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసినందుకు చాలా అవకాశాలే పోగొట్టుకున్నానని ఆయన వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమలో టీడీపీకి మద్దతిచ్చే వారు చాలామంది ఉన్నారని.. తాను వైసీపీకి సపోర్ట్ ఇవ్వడం కొన్ని సంతకం చేసిన సినిమాల నుంచి తప్పించారని ఆయన అన్నారు.