ప్రభాస్ అనుష్కల లండన్ ట్రిప్ వార్తల కలకలం !

ప్రభాస్ అనుష్కల లండన్ ట్రిప్ వార్తల కలకలం !

0

ప్రభాస్ అనుష్కల సాన్నిహిత్యం పై ఇప్పటికే అనేకసార్లు అనేక వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వచ్చిన ప్రతిసారి వీరిద్దరూ కందిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి లండన్ ట్రిప్ వ్యవహారం హాట్ న్యూస్ గా మారింది. అయితే వీరితోపాటు రాజమౌళి కూడ వెళుతున్నాడు.

తెలుస్తున్న సమాచారం మేరకు లండన్ లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ‘బాహుబలి 2’ ప్రత్యేకంగా ప్రదర్శింప బోతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ సినిమాలను ప్రతి సంవత్సరం ఈ హాల్ లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. సాధారణంగా ఇలాంటి ప్రదర్శనకు ఆస్కార్ అవార్డును పొందిన సినిమాలను ప్రదర్శిస్తారు. అయితే ఆస్కార్ పేనల్ కు కూడ వెళ్లకపోయినా ‘బాహుబలి’ కి ఈ గౌరవం దక్కడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వించ తగ్గ విషయం.

ఈ స్పెషల్ షోలకు లండన్ లోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు క్వీన్ ఎలిజిబత్ రాణి కుటుంబ సభ్యులు కూడ ఈ స్పెషల్ షోలను చూడటానికి వస్తూ ఉంటారు. ఈ ఏడాది అక్టోబర్ లో జరగబోయే ఈ ప్రత్యేక కార్యక్రమంలో ‘బాహుబలి’ ని ప్రదర్శించడమే కాకుండా ఈ మూవీకి సంబంధించిన ప్రజెంటేషన్ ను కూడ రాజమౌళి ఇవ్వబోతున్నాడు. దీనికోసం రాజమౌళి ఇప్పనుంచే ఆలోచనలు చేస్తున్నాడు.