ప్రభాస్ రాకకై సెల్ టవర్ ఎక్కిన యువకుడు

ప్రభాస్ రాకకై సెల్ టవర్ ఎక్కిన యువకుడు

0

జనగామ జిల్లా లో ఓవ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేస్తున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వస్తేనే తాను దిగుతానని చెబుతున్నాడు. మహబూబాబాద్ కు చెందిన గంగోత్రి వెంకన్న అనే యువకుడు జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఉడుముల హాస్పిటల్ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి నానా హంగామా చేస్తున్నాడు. పోలీసులకు ముప్పుతిప్పలు పెడుతుఎన్నడూ. ఎవరు ఎన్ని చెప్పినా దిగేది లేదని తెగేసి చెబుతున్నాడు. తన అభిమాన హీరో ప్రభాస్ వెంటనే జనగామ కి రావాలని, ప్రభాస్ రాకుంటే అక్కడి నుంచి దూకేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

ఇక ప్రభాస్ తాజా సినిమా సాహో అట్టర్ ప్లాప్ కావడంతో ఆవేదనతో సెల్ టవర్ ఎక్కి ఉంటాడు అని కొందర చర్చించుకుంటూ ఉంటే మరికొందరు అతనికి మతిస్థిమితం సరిగా లేదేమో అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు కారణమేమిటో తెలియక అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. పోలీసులు, స్థానికులు అతను కింద కు దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ పోలీసులు విజ్ఞప్తి సైతం పట్టించుకోకుండా వెంకన్న తన హంగామా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం వెంక నన్ను కిందకి దింపాడం పోలీసులకు తలనొప్పిగా మారింది. తన కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడి కోసం ప్రభాస్ స్పందిస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరమైన అంశమే.