ప్రభాస్ గురించి అభిమానులు ఏం చేశారో తెలిస్తే మతిపోతుంది

ప్రభాస్ గురించి అభిమానులు ఏం చేశారో తెలిస్తే మతిపోతుంది

0
Prabhas new look saaho movie stills

ప్రభాస్ సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకుంటారు అభిమానులు, అవును బాహుబలి నుంచి ప్రభాస్ సినిమాల రేంజ్ కూడా మారిపోయింది.. చిన్నసినిమాలు కాదు భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు బాలీవుడ్ పై కూడా ఫోకస్ చేస్తున్నారు, నిర్మాతలు దర్శకులు కూడా అదే రేంజ్ స్టోరీలు తీసుకువస్తున్నారు, అయితే అనుకున్న రేంజ్ కు సాహో వెళ్లకపోయినా తాజా చిత్రం గురించి మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం విపరీతంగా సాగుతోంది.

తాజాగా జాన్ అనే టైటిల్ పై చిత్రం తీస్తున్నారు ప్రభాస్… ఇంకా ఈ సినిమా టైటిల్ ఏం ఫిక్స్ చేశారు అనేది తెలియదు.. అయితే శరవేగంగా షూటింగ్ మాత్రం జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా గురించి అప్ డేట్ ఏం వస్తుంది అని సోషల్ మీడియాలో అభిమానులు ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది ప్రశ్నిస్తున్నారు…మీడియా సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతోంది.

దీంతో తాజాగా అభిమానులు ఒక ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. wewantprabhas20update అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నారు. అయితే జనవరి 1, 2020 కి ఫస్ట్ లుక్ ని విడుదల చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.కాని ఫిబ్రవరిలో ఈ సినిమా గురించి ఫస్ట్ లుక్ వస్తుంది అని చెబుతున్నారు మరి చూడాలి దీనిలో ఏది వాస్తవమో.