ప్రభాస్ కు 10వ స్థానం

ప్రభాస్ కు 10వ స్థానం

0
Prabhas new look saaho movie stills

ప్రభాస్ కు బాహుబలితో మంచిస్టార్ డమ్ వచ్చింది, అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా సినిమా రంగంలో మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా, ప్రభాస్ కు అభిమానులు ఆసియా అత్యంత శృంగార పురుషుల జాబితాలో 10వ స్థానం కట్టబెట్టారు. ఈ వార్త ప్రభాస్ అభిమానులకు ఫుల్ జోష్ తెచ్చిపెడుతోంది.
బ్రిటీష్ న్యూస్ వీక్లీ, ఈస్ట్రన్ ఐ సంస్థలు నిర్వహించిన సర్వేలో ప్రభాస్ కు భారీగా ఓట్లు పోలయ్యాయి.

అయితే ఏకంగా రికార్డు స్ధాయిలో ఈ సర్వే వెల్లడైంది…ఆసియా అత్యంత శృంగార పురుషుడు-2019 పేరిట ఆన్ లైన్ లో సర్వే నిర్వహించగా, ఈ ఫలితాలు వచ్చాయి. ఈ లిస్టులో బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ మొదటిస్థానంలో నిలిచాడు. టాప్-5లో ఆ తర్వాతి స్థానాల్లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, టీవీ నటుడు వివియన్ డిసేనా, బాలీవుడ్ యువ కథానాయకుడు టైగర్ ష్రాఫ్, బ్రిటీష్ ఏషియన్ పాప్ స్టార్ జయన్ మాలిక్ నిలిచారు..కోహ్లీకి 7 వస్ధానం లభించింది.

అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం తాజాగా ఈ సర్వేని మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. తమ హీరో వచ్చే రోజుల్లో మరింత ఫస్ట్ ర్యాంకుకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.. ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా పాల్గొన్నారు అని తెలుస్తోంది