ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ కి రంగం సిద్ధం..!!

ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ కి రంగం సిద్ధం..!!

0

సాహో సినిమా తో మరో హిట్ అందుకుని నటినల్ స్టార్ డం ను మరింత పెంచుకున్న ప్రభాస్ తన తదుపరి చిత్రం గా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది.. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికి కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాదులోని ఒక స్టూడియోలో ప్లాన్ చేశారు.

భారీ యాక్షన్ సీన్స్ ను ఇక్కడ చిత్రీకరించనున్నారు. భారీ సెట్లతో అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.ప్రస్తుతం విదేశాల్లో వున్న ప్రభాస్ అక్కడి నుంచి తిరిగి రాగానే ఈ షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాకి ‘జాన్’ అనే టైటిల్ పరిశీలనలో వుంది.

అయితే అదే టైటిల్ ను ఖాయం చేస్తారా? మరో టైటిల్ ను సెట్ చేస్తారా? అనేది ఈ నెల 23వ తేదీన తేలిపోతుంది. ఎందుకంటే ఆ రోజున ప్రభాస్ పుట్టినరోజు .. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్టులుక్ ను రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారట. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.