బయటపడిన ప్రభాస్ నెగిటివ్ షేడ్స్

బయటపడిన ప్రభాస్ నెగిటివ్ షేడ్స్..

0

యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా, సుజిత్ డైరెక్షన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ యాక్షన్ సాహూ మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే అనుకుంటే సినిమా ప్రమోషన్లలో ఈ చిత్రానికి సంబంధిచిన అనేక విశేషాలు తెలియజేస్తూ ఇంకాస్త అంచనాలు పెంచేస్తున్నారు.

తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రభాస్ ను మీరు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తారా అన్న ప్రశ ఎదురైంది. దీనికి ప్రభాస్ అనాలోచితంగా సాహోలో తన పాత్ర కొంచెం అలాగే ఉంటుందని పెద్ద బాంబ్ పేల్చాడు. దీనితో సాహూ చిత్రంలో ప్రభాస్ పాత్ర నెగిటివ్ లక్షణాలు కలిగివుంటుందనే విషయాన్ని అయన చెప్పకనే చెప్పేశారు.

ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, నిల్ నితిన్, అరుణ్ విజయ్, మందిరా భేడి, మురళి శర్మ, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.