ప్రదీప్ సైలెంట్ వెనుక సీక్రెట్ ఎంటీ….

ప్రదీప్ సైలెంట్ వెనుక సీక్రెట్ ఎంటీ....

0

బుల్లితెర మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ప్రస్తుతం యాంకరింగ్ లో టాప్ పొజీషన్ లో ఉన్నాడు… వివిధ షోలకు యాంకరింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రదీప్ బుల్లితెరలోనే కాదు వెండితెరలో కూడా పలు చిత్రాల్లో నటించాడు… ఇప్పుడు హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నాడు…

30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంలో హీరోగా నటించాడు ప్రదీప్… అన్ని సక్రమంగా జరిగిఉంటే ఈ పాటికి ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యేది… కానీ కరోనా కారణంగా ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు… ఈ చిత్రంలో నీలి నీలి ఆకాశం పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే…

ఇప్పటికీ ఈ సాంగ్ ప్రతీ ఒక్కరి మొబైల్ లో ఆల్బమ్ లో ఉంటుంది… లేదంటే ఈ పాటికి ప్రదీప్ సినిమాని ప్రేక్షకులు మర్చిపోయేవారు… వాస్తవానికి ఈ చిత్రాన్ని దసరా పండుగకు ఓటీటీలో విడుదల చేస్తారని అనుకున్నారు… కానీ ప్రదీప్ 30 రోజుల ప్రేమ కథ ఓటీటీకి ఎక్కలేదు… సైలెంట్ గా ఉన్నాడు.. ఇక దీపావళి అనుకున్నారు… అదికూడా లేదు… సంక్రాంతి పండుగకనో లేదంటే వచ్చే ఏడాదనో అనౌన్స్ చేస్తే బాగుంటూంది కానీ ఎందుకో 30 రోజులు ప్రేమ కథ టీమ్ సైలెంట్ గానే ఉంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here