ప్రజలకు క్షమాపణ చెబుతా చంద్రబాబు మరో సంచలనం

ప్రజలకు క్షమాపణ చెబుతా చంద్రబాబు మరో సంచలనం

0

తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై వైకాపా ప్రభుత్వం తీరు పై ప్రశ్నించారు.. అక్కడ డవలప్ మెంట్ ఆగిపోయింది అని అలాగే రైతులు ఆందోళన చెందుతున్నారు అని తెలియచేశారు. తాజాగా ప్రజా రాజధాని అమరావతి పై విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ..

ఆయన ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పలు రాజకీయ పార్టీల నేతలు ప్రజాప్రతినిధులు హజరు అయ్యారు.రాజధానిపై ప్రజలకు అవగాహన కల్పించటమే ఈ సమావేశ లక్ష్యమని అన్నారు. ఇది ప్రజా రాజధాని ప్రజలకోసం ఏర్పాటు చేశాము అని ఏపీ ప్రజల భవిష్యత్తు ఇక్కడే ఉంది అని తెలియచేశారు చంద్రబాబు.

రాజధాని నిర్మాణంలో ఆరునెలలుగా ఒక్క పని ముందుకు సాగలేదు అని, ఈ రాజధాని ముందుకు తీసుకెళ్లకపోతే యువత తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. ఏపీ రాజధానిగా మనం ధీటైన నగరం నిర్మించకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు తప్పు అని ప్రజలు అంటే, తాను క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానంటూ భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు.. తమపై వైసీపీ నేతలు కావాలనే విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు అని , తమవి గ్రాఫిక్స్ అని వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారు అంటూ విమర్శించారు చంద్రబాబు . ప్రపంచ మేటి నగరాలలో ఒకటిగా అమరావతి చేద్దాం అనుకున్నా అని తెలియచేశారు చంద్రబాబు.