ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

0

చాయ్ పే చ‌ర్చా నుంచి దేశ ప్రజలకు ఫేమ‌స్ అయిన ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… ప్రస్తుతం అగ్ర రాజ్యాలు భారత్ అమెరికా అధినేతలు కలిసి వేదిక పంచుకున్న హ్యూస్టన్ హౌడీ మోడీ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంశం అయిన సంగతి తెలిసిందే.

దీనిపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు..మోడీ డొనాల్డ్ ట్రంప్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఈ కార్యక్రమం ట్రంప్ కు ఎంతో లబ్ది చేకూర్చుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ఆసన్నమైన వేళ ఈ కార్యక్రమానికి ట్రంప్ హాజరు కావడం ఎంతో వ్యూహాత్మకమైన చర్యగా ప్రశాంత్ కిశోర్ అన్నారు.. కాగా హౌడీ మోడీ కార్యక్రమంలో భారత దేశ ప్రధాని ప్రసంగిస్తూ రానున్న ఎన్నికల్లో మరోసారి అమెరికా ప్రజలు ట్రంప్ కే ఓటు వేయాలని అన్నారు.