అఖిల్ ఐదో సినిమాకు దర్శకుడు దొరికాడు..!!

అఖిల్ ఐదో సినిమాకు దర్శకుడు దొరికాడు..!!

0

మొదటి మూడు సినిమాలతో పర్వాలేదనిపించుకున్న అఖిల్ తన నాలుగో సినిమాగా బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేయనున్నాడు. ఫామిలీ ఎమోషన్స్ బాగా తీయగల భాస్కర్ అఖిల్ తో కూడా అలాంటి సబ్జెక్టు తీయబోతున్నాడట.. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ చేయబోయే సినిమా పై ఓ క్లారిటీ వచ్చింది..

ఇటీవలే ఆ అనే సినిమా తో హిట్ కొట్టి, కల్కి సినిమా తో పర్వాలేదనిపించుకున్న ప్రశాంత్ వర్మ అఖిల్ ఐదో సినిమా కి దర్శకుడు అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ లో వినిపిస్తుంది. ఇటీవలే వినిపించిన కథ అఖిల్ కి నచ్చిందట. ప్రశాంత్ వర్మ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం.

నిజానికి కాజల్ ప్రధాన పాత్రధారిగా ఒక సినిమాను రూపొందించాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసుకున్నాడు. అందుకు ఆలస్యం అవుతుండటంతో ఆయన అఖిల్ ను లైన్ లో పెట్టేశాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో వున్నారు.