ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇస్తున్న జగన్

0

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంస్కరణల దిశగా తన ప్రభుత్వాన్ని పాలనని తీసుకువెళుతున్నారు, అయితే జగన్ తన పాలనలో ఏవి అమలు చేయాలి అనేది కూడా పక్కాగా అనుకుని సాగుతున్నారు. కాని జగన్ ముందు అనుకుంటున్న నిర్ణయాలు చివరకు ఫెయిల్ అవుతున్నాయి. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడతాం అని చెప్పడంతో ఇది పెద్ద విమర్శలకు కారణం అయింది, సంస్కృత భాషా కార్యక్రమంలో మాతృభాషకు విలువ ఇవ్వడం గురించి మాట్లాడిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురించి… పేరుపెట్టి ప్రతివిమర్శలు చేస్తూ చిన్న వివాదానికి కారణం అయ్యారు. దీంతో మరింత విమర్శలకు కారణం అయ్యారు ఇటు బీజేపీ తెలుగుదేశం కూడా జగన్ని టార్గెట్ చేసింది. ఇక పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు అనే అంశం మళ్లీ జగన్ స్వయానా ఆయనే కామెంట్ చేశారు.

ఇక తాజాగా ఇసుక వారోత్సవాలతో ప్రతిపక్షాలకు జగన్ ఆయుధం ఇస్తున్నట్లు మారుతోంది. ఇసుక వారోత్సవాలు అంటే రోజుకు రెండు లక్షల టన్నుల ఇసుక ఇవ్వాలి అని టార్గెట్ పెట్టారు. దీంతో ఇది ఉత్సవంగా చేయడం పై జనంలో కూడా కాస్త విమర్శలు వస్తున్నాయి, అంటే ఈ ఏడు రోజులు ఇచ్చి తర్వాత ఇసుక లేదు అంటారా, ఇది ప్రతిపక్షాలకు ఆయుధం అవుతుంది.. ఇలాంటి ఆలోచన జగన్ ప్రభుత్వానికి సరైనది అనిపించినా ప్రజలకు వేరే సంకేతాలు వెళతాయి, సరిగ్గా ఇసుక అందుబాటులో ఉంటే మిమ్మల్ని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పేచీ పెట్టినా ఎవరూ పట్టించుకోరు.. ఇలా వారోత్సవాలు ఉత్సవాలతో మరింత జగన్ ప్రతిపక్షాల ఉచ్చులో పడుతున్నారు అంటున్నారు మేధావులు.