ప్రతిపక్షాలకు చుక్కలే – సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎక్కడంటే ?

ప్రతిపక్షాలకు చుక్కలే - సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎక్కడంటే ?

0

జీహెచ్ఎంసీ ఎన్నికలపై అన్నీ రాజకీయ పార్టీలు టార్గెట్ పెట్టాయి, మేయర్ పీఠం కోసం పెద్ద ఎత్తున పార్టీలు పోటీ పడుతున్నాయి, ఇక అధికార టీఆర్ఎస్ మరోసారి గ్రేటర్ లో తమ సత్తా చాటాలి అని చూస్తోంది, ఐటీ ఎంతో డవలప్ అయింది టీఆర్ఎస్ పాలనలో, అయితే ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ మాటల కోసం అందరూ ఎదురుచూస్తారు . గులాబీ బాస్ ఇచ్చే ఎన్నికల హామీల కోసం చూస్తారు అందరూ.

అయితే ఈ సమయంలో గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ నేతలు అందరూ కూడా ప్రచారం చేయనున్నారు.. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ఈ నెల 22వ తేదీ నుండి గ్రేటర్లో రోడ్షోలు నిర్వహించనున్నారు. ఇక సీఎం కేసీఆర్ తో కూడా గులాబీ పార్టీ సభ పెట్టాలి అని చూస్తోంది.

కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారని.. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. సో దీనిపై ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది, మొత్తానికి కేసీఆర్ ఓ గంట స్పీచ్ ఇస్తే ప్రతిపక్షాల పని ఇక అయినట్లే అంటున్నారు గులాబీ నేతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here