ప్రేమ వివాహలపై సంచలన రిపోర్ట్ లవర్స్ తెలుసుకోవాల్సిందే

ప్రేమ వివాహలపై సంచలన రిపోర్ట్ లవర్స్ తెలుసుకోవాల్సిందే

0

మన దేశంలో ఈ లాక్ డౌన్ వేళ అందరూ ఇంటికి పరిమితం అయ్యారు, అయితే లవర్స్ కు కూడా ఇది పెద్ద లాక్ డౌన్ అనే చెప్పాలి… కాలేజీకి వెళ్లేవారు ఉద్యోగాలు చేసే వారు ఇంటిలో ఉండి, అప్పుడు అప్పుడు కలుసుకునే లవర్స్ కూడా ఈ లాక్ డౌన్ వల్ల ఇంటిలో ఉంటున్నారు.

అయితే గత ఫ్రిబ్రవరి మార్చి నెలలలో పోలిస్తే ఏప్రిల్ నెలలో చాలా వరకూ 85 శాతం ప్రేమ వివాహాలు తగ్గాయట.. రేటింగ్ లవ్ కపుల్స్ అనే సంస్ధ చేసిన సర్వేలో ఈ విషయం తెలిసింది.. వందలో కేవలం 15 మంది మాత్రమే మే నెలలో వివాహాలు చేసుకున్నారని అవి కూడా గుడి బయట మెట్లదగ్గర పది మంది స్నేహితుల మధ్య వివాహం చేసుకున్న వారే ఎక్కువ అని తెలిపింది.

మన దేశంలో ఏప్రిల్ నెలలో ప్రేమ వివాహాలు చాలా తగ్గాయని తెలిపింది ఈ సంస్ధ , అయితే ఇదంతా లాక్ డౌన్ ఎఫెక్ట్ అని అంటోంది, అయితే ఇలా తల్లిదండ్రులను కాదని చేసుకున్న వారే చాలా మంది ఉన్నారని తెలిపింది, ఓ పక్క రిజిస్ట్రార్ ఆఫీసులు కూడా లేకపోవడంతో, ముందు దండలు మార్చుకున్నారట వీరందరూ.