ప్రేమించిన అమ్మాయి దక్కలేదు అని చివరకు దారుణం చేశాడు

ప్రేమించిన అమ్మాయి దక్కలేదు అని చివరకు దారుణం చేశాడు

0

పదవ తరగతిలో చందన రాము ప్రేమించుకున్నారు.. అయితే కులాలు వేరు కావడంతో చందన వేరే ప్రాంతం వెళ్లి చదువుకుంది, తండ్రికి తెలిస్తే ఊరుకోడు అని రాముకి చెప్పలేదు, తర్వాత చూద్దాం అని వేరే చోట చదువుకుంది. కాని చందనని మాత్రం రాము ప్రేమిస్తూనే ఉన్నాడు. రాము మాత్రం ఇంటర్ చదవకుండా దుబాయ్ వెళ్లి బాగా సంపాదించాడు. చివరకు చందన ఇంజనిరింగ్ పూర్తి చేసి ఓకంపెనీలో ఉద్యోగం చేస్తోంది, తనలా ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది , రాముని మర్చిపోయింది.

అయితే కులాలు వేరు కాబట్టి పెళ్లి చేయరు అని ఆమె తన తండ్రి చూసిన పెళ్లి చేసుకుంది… అయితే తాను ప్రయోజకుడిని అయితే చందన తండ్రి పెళ్లి చేస్తాడు అని భావించి, రాము లక్షల రూపాయలు సంపాదించి ప్రయోజకుడు అవుతాడు.. చందనతో మాట్లాకుండా పదేళ్లు ఉంటాడు అయితే ఈలోపు ఆమె పెళ్లి చేసుకున్న విషయం కూడా ఎవరూ చెప్పరు.

కాని దుబాయ్ నుంచి ఇండియా వచ్చి చందనని కలవాలి అని అనుకుంటాడు .. కాని ఆమెకు పెళ్లి అయింది అని పదవ తరగతి ఫ్రెండ్ చెబుతాడు. తామిద్దరం ఎక్కడ అయితే ప్రేమించుకున్నామో అక్కడే చెట్టుదగ్గర ఉరివేసుకుని చనిపోతాడురాము , తన తండ్రి తల్లిని తన తమ్ముడు బాగా చూసుకోవాలి అని తన ప్రేమ సాధించుకోలేకపోయా అని లేఖరాసి చనిపోతాడు.