ఇంకా ఎన్ని రోజులు? : ప్రియాంక గాంధీ

ఇంకా ఎన్ని రోజులు? : ప్రియాంక గాంధీ

0

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి విమానంలో ఎదురైన సంఘటనపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విటర్ ద్వారా స్పందించారు. జాతీయవాదం పేరుతో కొందమంది ప్రజల నోరును నొక్కేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్లో పరిస్థితులను సమీక్షించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేతలు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. వారిని కశ్మీర్లోపలికి అక్కడి అధికారులు అనుమతించకపోవడంతో వెనక్కి వచ్చారు. అయితే విమానంలో తిరిగివస్తుండగా రాహుల్గాంధీ వద్దకు హఠాత్తుగా ఓ మహిళ వచ్చి తాను ఎదుర్కొంటున్న కష్టాల గురించి బాధతో వివరించింది.

దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాధికా ఖేరా ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ప్రియాంక.. ’ఇంకా ఎన్ని రోజులు కొనసాగబోతోంది..? జాతీయవాదం పేరుతో లక్షల మంది ప్రజల నోరును నొక్కేస్తున్నారన్నారు.’ అంటూ మండిపడ్డారు.