బీజేపీలోకి తెలుగు ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాత

బీజేపీలోకి తెలుగు ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాత

0

మరికొద్ది రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన బడా నిర్మాత బీజేపీలో చేరనున్నారా అంటే అవుననే విధంగా వార్తలు వస్తున్నాయి… ఆ నిర్మాత ఎవరో కాదు ప్రముఖ దిల్ రాజ్ ఈయన త్వరలో బీజేపీలో చేరుతారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

ఇటీవలే జాతిపిత మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా మోదీ సినీ సెలబ్రెటీలకు విందు ఇచ్చిన సంగతి తెలిసిందే… ఈ విందులో దిల్ రాజ్ పాల్గొన్నారు… ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్వీట్ చేశారు… టాలీవుడ్ లో దిల్ రాజుకు తప్ప ఎవ్వరకి ఇన్విటేషన్ లేదు.

దీంతో అనేక అనుమానాలకు తెర తీస్తోంది… త్వరలో ఆయన బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. అందుకే ఆయన ప్రధాని విందుకు హాజరు అయ్యారని అంటున్నారు… పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చార.. ఇక ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నదిల్ రాజ్ ఈ ఆఫర్ ను ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి…