ఉప్పెన దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నిర్మాతలు

0
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు… ముఖ్యంగా దేశంలోనే  ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది… తొలి సినిమాతో వంద కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరారు, ఇక డెబ్యూ మూవీగా వైష్ణవ్ కు మంచి క్రేజ్
వచ్చింది.. ఇక ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి లు పరిచయం అయ్యారు. ఇక మంచి లాభాలు రావడంతో ఇప్పటికే వీరికి మంచి రెమ్యునరేషన్లు అందించారు నిర్మాతలు.
హీరో వైష్ణవ్ తేజ్కు కోటి రూపాయలు, హీరోయిన్ కృతీ శెట్టికి రూ.25 లక్షలు ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి.
ఇక నిర్మాణ సంస్ధ డైరెక్టర్ కి ఇల్లు లేదా కారు ఆఫర్ చేసింది, అయితే బుచ్చిబాబు కారు తీసుకునేందుకు ఆసక్తి చూపించారట
దీంతో బెంజ్ జీఎల్సీ కారును గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు డైరెక్టర్ని.
దీని విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని అంచనా.ఇక వెంటనే తనగురువు దర్శకుడు సుకుమార్ ని కారులో ఎక్కించుకుని వెళ్లారు దర్శకుడు బుచ్చిబాబు ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here