రాహుల్ ని ముద్దుల్లో ముంచేసిన పునర్నవి..!!

రాహుల్ ని ముద్దుల్లో ముంచేసిన పునర్నవి..!!

0

బిగ్ బాస్ లో సభ్యులు 57 రోజులు విజయవంతంగా గడిపారు.. అయితే నిన్న టి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది.. ఇందులో భాగంగా హౌస్ లో ని అందరిని నేరుగా నామినేట్ చేసిన బిగ్ బాస్ వారు సేవ్ అవడానికి ఆ కంటస్టెంట్ కి దగ్గరగా ఉన్న లేదా విరోధి అయినా మరో కంటస్టెంట్ ని తమ కోసం త్యాగం చేయాలనీ చెప్పగా పునర్నవి కోసం రాహుల్ చేసిన పనికి రాహుల్ ని ముద్దుల్లో ముంచెత్తింది పునర్నవి..

ఇంతకీ విషయం ఏంటంటే 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ రాహుల్ తాగితే పునర్నవి ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటుందని చెప్పాడు బిగ్ బాస్.దీంతో ఈ విషయాన్ని.. పునర్నవి రాహుల్ తో చెప్పగా, రాహుల్ కూడా వెంటనే తన దోస్త్ కోసం ఓకే అన్నాడు. అన్నట్టుగానే 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్‌ను క్లోజ్ ఫ్రెండ్ పునర్నవి కోసం తాగేశాడు. అయితే 20వ గ్లాస్ తాగి.. విజయగర్వంతో పునర్నవి వద్దకు రాగానే.. రాహుల్‌ను పునర్నవి గట్టిగా హత్తుకుని బుగ్గపై ఓ ముద్దు పెట్టింది..