జగన్ నుంచి పిలుపు… పురందేశ్వరి క్లారిటీ…

జగన్ నుంచి పిలుపు... పురందేశ్వరి క్లారిటీ...

0

కొద్దకాలంగా పర్చూరు నియోజకర్గంలో దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన రాజకీయ వ్యవహారం సంచలనంగా మారుతోంది… త్వరలో పురందేశ్వరి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆమె స్పందించారు…

తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… గత ఎన్నికల్లో తాను వైసీపీలో చేరాలని పిలుపు వచ్చిందని అన్నారు… ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సంప్రదింపులు జరగట్లేదని స్పష్టం చేశారు పురందేశ్వరి తన భర్త మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరక ముందు తాను పార్టీ మారనని స్పష్టం చేశానని అన్నారు..

ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు అలాగే చెంచురాంలు వైసీపీలో చేరారన అన్నారు… ఇదే విషయాన్ని తన భర్త వారికి చెప్పారని అన్నారు… కాగా పురందేశ్వరి ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసిఓటమి చెందిన సంగతి తెలిసిందే…