నందమూరి హీరోతో పూరి సినిమా

బాలకృష్ణ తో మరోసారి పూరి సినిమా

0

పైసా వసూల్ సినిమా పూరి జగన్నాథ్, బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా మాస్ ఆడియన్స్ నీ ఆకట్టుకుంది. అదే సమయంలో తన కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుందని చెప్పాడు పూరి. గతంలో చెప్పిన మాటని పూరి ఇప్పుడు నిజం చేస్తున్నాడు. బాలయ్యతో పూరి ఒక ప్రాజెక్టు సెట్ చేశారన్నది తాజా వార్త.

బాలయ్య ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ లో ఉన్నాడు బాలయ్య. అనంతరం బాలయ్య బోయపాటి తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఇక పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయనున్నాడు.

అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఇటు బాలయ్య, బోయపాటి ప్రాజెక్టు, అటు పూరి, విజయ్ దేవరకొండ ప్రాజెక్టులు పూర్తి అయిన తరువాత బాలకృష్ణ, పూరి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్టు పట్టాలు ఎక్క నుందని సమాచారం.