పూరి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సీక్వెల్ తీయబోతున్నాడా?

పూరి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సీక్వెల్ తీయబోతున్నాడా?

0

పూరి అందించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఒకటి పూరి దర్శకత్వంలో రవితేజ హీరోగా 2003 విడుదలై ఘన విజయం అందించింది. మథర్ సెంటి మెంట్ కి బలంగా నిలిచింది. ఇప్పుడీ సినిమా సీక్వెల్ రాబోతున్నట్టు సమాచారం. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వఛ్చిన్న పూరి తన తదుపరి సినిమా విజయ దేవరకొండతో చేస్తున్న సంగతి తెలిసిందే..

ప్రస్తుతం సినిమా స్కిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు పూరి. ఈ సినిమా కోసం ఫైటర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో పూరి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సీక్వెల్ తీయబోతున్నారని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంలో నిజమెంత..? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..