పుంరదేశ్వరికి షాక్ రంగంలోకి కీలక నేత….

పుంరదేశ్వరికి షాక్ రంగంలోకి కీలక నేత....

0

విశాఖ బీజేపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి… విశాఖను మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తన సొంత ప్లేస్ గా భావిస్తున్నారు… 2019 ఎన్నికల్లో ఆమె విశాఖ నుంచి ఓటమి చెందినా కూడా వచ్చే ఎన్నికల నాటికి బలంపెంచుకుని పోటీ చేసి గెలవాలని చూస్తోంది… అయితే ఆమెకు విశాఖలో అవకాశం ఇవ్వకుండా చేసేందుకు పావులు కదుపుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

విశాఖ బీజేపీలో కాశిరాజు కీలక నేతగా ఉన్నారు… ఆయన ఇప్పుడు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు… ఆయన గతంలో విశాఖ వన్ సెగ్మెంట్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు… ఆయన నటుడు కృష్ణం రాజుకు దగ్గరి బంధువు… ఆ విధంగా ఆయనకు నేరుగా మోదీ తోను, అలాగే హస్తినలో ఉన్న పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి…

దీంతో ఆయన రానున్న రోజుల్లో విశాఖ నుంచి పార్టీ చక్రం తిప్పాలను చూస్తున్నారట… ఎన్నికల నాటికి బీజేపీకి బాగా కలిసి వస్తుందని రాజుగారు భావిస్తున్నారట… అప్పటికి కొత్త పొత్తులు కుదరుతాయని భావిస్తున్నారట… దాంతో విశాఖ నుంచి బీజేపీ ఎంపీగా టికెట్ సంపాదిస్తే ఇక ఫ్లైట్ లో ఢిల్లికి వెల్లి పార్లమెంట్ లో కూర్చోవడమే తరువాయి అని భావిస్తున్నారట…

అందులో భాగంగా ఆయన ఈ మధ్యకాలంలో జోరు పెంచుకుంటున్నారట.. మొత్తంమీద రాజుగారి దూకుడు చూస్తుంటే పురందేశ్వరికి చెక్ చెప్పేందుకు సర్వం సిద్దం చేసుకున్నట్లే అని చర్చించుకుంటున్నారు కొందరు…