పుష్ప-1 ట్రైలర్..సుకుమార్ స్కెచ్ మామూలుగా లేదు..!

Pushpa-1 trailer..Sukumar sketch is not normal ..!

0

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకోసం బన్నీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే పాటలు ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను దక్కించుకుంటున్నాయి ఈ సాంగ్స్ .

ఇక ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తుంది. డిసెంబర్ మొదటి వారంలో పుష్ప ట్రైలర్ ను విడుదల చేయనున్నారని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ మొదటివారంలో దుబాయ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం చివరి సాంగ్ ను షూట్ చేస్తున్నారట. ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here