రాధా అనుకున్నదొకటి అవుతుంది మరోకటి…

రాధా అనుకున్నదొకటి అవుతుంది మరోకటి...

0

2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన చంద్రబాబు నాయుడుకు ఆపార్టీ నాయకులు షాక్ లమీద షాక్ లు ఇస్తున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావాలంటే కష్టతరంతో కూడుకున్న పని అని భావించి కొంతమంది తమ రాజకీయ భవిష్యత్ రిత్య ఇతర పార్టీల్లో చేరుతున్నారు..

ఈ క్రమంలో కొంతమంది వైసీపీలోకి మరికొంతమంది బీజేపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను కూడా టీడీపీ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు అతని సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నారట..

గత ఎన్నికల్లో పోటీ దూరంగా ఉన్న రాధా టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఎమ్మెల్సీ అయ్యేవారు… కానీ ఇప్పట్లో ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ కూడాలేదు పోనీ ఒక వేళ టీడీపీలో కొనసాగినా కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు అందుకే ఆయన్ను టీడీపీ నుంచి బయటకు తీసుకువచ్చి జనసేనలో జాయిన్ చేయిస్తే విజయవాడ సెంట్రల్ సీటు వచ్చే ఎన్నికల్లో ఆయనకే వస్తుందని భావిస్తున్నారట సన్నిహితులు… మరి చూడాలి ఏం జరుగుతాదో…