జగన్ ని భయపెడుతున్న ఎంపీ

జగన్ ని భయపెడుతున్న ఎంపీ

0

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్ ని కాస్త టెన్షన్ పెట్టిస్తున్నారు… ముఖ్యంగా బీజేపీ నేతలతో టచ్ లో ఉంటూ ఆయన పెద్ద ఎత్తున డైలమా క్రియేట్ చేస్తున్నారు.. అయితే ఆయన పార్టీ మారను అని చెప్పడంతో కాస్త టెన్షన్ తగ్గింది.. కాని మరోసారి అగ్గి రాజేశారు.. ఆయన చర్యలతో. ఇంతకీ రాజుగారు చేసిన చర్య వైసీపీ నేతలను మరోసారి కలవరపాటుకి గురిచేసింది.

భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలోకి ఆయన వెళ్లారు.. అయితే ఆయన ఎవరిని కలిశారు ఏమిటి ఆయన నిర్ణయం అనేది ఇప్పుడు పార్టీ నేతలని షాక్ కి గురిచేస్తోంది.. అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి – మిధున్ రెడ్డికి కూడా ఆయన చెప్పలేదు, దీంతో అందరూ ఇదే చర్చించుకుంటున్నారు. అయితే ఆయన మాత్రం పాత పరిచయం ఉన్న మిత్రులతో మాత్రమే మాట్లాడారు అని అంటున్నారు.