వందరోజుల మోది పాలనపై రాహుల్ వివుర్శలు

వందరోజుల మోది పాలనపై రాహుల్ వివుర్శలు

0

ప్రధాని నరేంద్ర మోదీ వంద రోజుల పాలనపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు విమర్శలు గుప్పించారు. ప్రగతి లేకుండా వంద రోజుల పాలన సాగిందని వివుర్శలు గుప్పిస్తున్నారు. మీడియా గొంతు నొక్కుతూ, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతూ మోదీ పాలన కొనసాగుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాలపై రాజకీయ కక్షతో దర్యాప్తులు చేస్తోందని విమర్శించారు.

రాజకీయ అనిశ్చితి కారణంగా పలు సమస్యలు ఏర్పడ్డాయని, ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని అన్నారు. మోదీ వందరోజుల పాలనతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని ప్రియాంక గాంధీ విమర్శించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల గురించి అబద్ధాలు చెబుతూ, నాటకాలు ఆడుతున్నారని ఆమె విమర్శించారు.