రైల్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్న వారికి మరో గుడ్ న్యూస్

రైల్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్న వారికి మరో గుడ్ న్యూస్

0

కరోనా సమయంలో దేశంలో మొత్తం లాక్ డౌన్ విధించారు.. ఇప్పుడు నిన్నటితో ముగిసిన లాక్ డౌన్ మే 3 వరకూ పొడిగించారు.. దీంతో ఎక్కడ రవాణా అక్కడ స్ధంభించిపోయింది, ముఖ్యంగా ప్రజారవాణా మాత్రం నిలిచిపోయింది, బస్సు రైలు విమానప్రయాణాలు లేవు, ఎక్కడ వారు అక్కడే ఉన్నారు

ఇక నిన్న లాక్ డౌన్ ఎత్తేస్తారు అని చాలా మంది రైలు బస్సుకి టికెట్లు చేసుకున్నారు… కాని పొడిగింపుతో అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. మన దేశీయ రైల్వే సుమారు 39 లక్షల టికెట్లను రద్దుచేయనుంది. ఇవన్నీ ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు బుక్చేసుకున్న టికెట్లే.

ఇది ఓ రికార్డ్ అని అంటున్నారు, దేశంలో ఇదే మొదటిసారి ఇంతలా మన రైల్వే టిక్కెట్లు క్యాన్సిల్ చేయడం అంటున్నారు, ఇక బస్సు టిక్కెట్లు కూడా లక్షల్లో దేశ వ్యాప్తంగా క్యాన్సిల్ అవుతున్నాయి, అలాగే విమాన ప్రయాణాలు కూడా డొమెస్టిక్ ఇలాగే క్యాన్సిల్ అవుతున్నాయి.

ఆన్లైన్లో టికెట్లు బుక్చేసుకున్న వారికి వెంటనే తిరిగి నగదు చెల్లిస్తారు రైల్వే సిబ్బంది, ఇక టికెట్ కౌంటర్ లో చేసుకున్న వారికి మరికొద్ది రోజులు ఆగిన తర్వాత నగదు చెల్లిస్తామని తెలిపింది రైల్వేశాఖ.