ఆసక్తికరంగా రాజ్ తరుణ్ కొత్త సినిమా టైటిల్..!!

ఆసక్తికరంగా రాజ్ తరుణ్ కొత్త సినిమా టైటిల్..!!

0

యంగ్ హీరో రాజ్ తరుణ్ గతకొన్ని రోజులుగా తన సినిమా లతో మెప్పించలే కపోతున్నాడని చెప్పొచ్చు.. ఎ సినిమా చేసిన అది ప్రేక్షకులను నచ్చకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఓ సరికొత్త చిత్రంతో వస్తున్నాడు.. బాలీవుడ్ లో సరికొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయడంలో ముందుంటాడు ఆయుష్మాన్ ఖురానా. ఇప్పటికే ‘అంధాదున్’, ‘బదాయి హో’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేసిన ఆయుష్మాన్ తాజాగా ‘డ్రీమ్ గర్ల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

అయితే ఈ చిత్రం తెలుగు రీమేక్ లో హీరో గా రాజ్ తరుణ్ ని నటిమ్పచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు నిర్మాత సురేష్ బాబు.. హిందీ వెర్షన్ చూసిన తర్వాత ఈ సినిమాకి తెలుగు రీమేక్ లో రాజ్ తరుణ్ ఐతే బాగా సూట్ అవుతాడని.. అతనిని సంప్రదించడంతో ఒప్పుకున్నాడట.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ ని ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. తెలుగు నేటివిటీకి సూటయ్యే లాగా స్క్రిప్టులో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయబోతున్నట్లు సమాచారం. సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.