రాజధాని అంశంపై పవన్ కీలక వ్యాఖ్యాలు

రాజధాని అంశంపై పవన్ కీలక వ్యాఖ్యాలు

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు… ఇటీవలే జగన్ మోహన్ రెడ్డి విదేశీ తరహాలో ఏపీకి మూడు రాజధానులు రావచ్చని అన్నారు…

అమరావతిలో లెజిస్లేటర్ క్యాపిటల్ రావచ్చు, విశాఖ పట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావచ్చు, కర్నూల్ జిల్లాలో జుడిషియల్ క్యాపిటల్ రావచ్చని జగన్ అన్నారు… దీనిపై పవన్ మరోసారి స్పందిచారు… రాజధాని కోసం 33 వేల ఎకరాలు భూములు ఇస్తే ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం మార్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు…

అందులో భాగంగానే రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాలు బంద్ లు పాటిస్తున్నాయని పవన్ అన్నారు… కాగా నిన్న కూడా రాజధానిపై పవన్ స్పందించారు… . ఒక రాజధానికే దిక్కులేదని అనుకుంటుంటే మూడు రాజధానులు ఎలాసాధ్యం అని ప్రశ్నించారు…