రాజధానిపై వర్మ తాజా విశ్లేషణ

రాజధానిపై వర్మ తాజా విశ్లేషణ

0

ప్రస్తుతం ఏపీలో రాజధాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది… ఏపీలో మూడు రాజధానులు రావచ్చు అని ముఖ్యమంత్రి జగన్ చెప్పడంతో అమరావతి ప్రజలు వ్యతిరేకిస్తుంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఆహ్వానిస్తున్నారు…

ఈ నేపంథ్యంలో దర్శకుడు వర్మ కూడా స్పందించారు… రాజధాని ఎక్కడ ఉంటే ఏంటని అన్నారు… రాజకీయాలతో సంబంధంలేని నాలాంటి వాడికి రాజధాని ఎక్కడ ఉన్నా పర్వాలేదని అన్నారు… తాను రాజధానికి పక్క రాష్ట్రంలో ఏర్పాటు చేసినా పట్టించుకోనని అన్నారు…

రాజధాని అంటే మెయిన్ థియేటర్ లాంటిదని అన్నారు… ప్రజలకు నేరుగా పాలన అందాలంటే ప్రతి పట్టణానికి ఒక రాజధాని ఏర్పాటు చేయాలని అభిప్రాయ పడ్డారు… కాగా వర్మ వివాదాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారనే పేరు ఘటించుకున్నారు… తన అభిప్రాయాలను నిర్మొహమాటాంగా చెబుతూ సంచలనంగా మారుతుంటారు…